వెండితెరపైన మొట్టమొదటిసారిగా సమంత మరియు సూర్య లింగుస్వామి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో కలిసి నటించనున్నారు. ఈ సినిమా లింగుస్వామి గత సినిమాల మార్కును తలపించేలా రొమాంటిక్ యాక్షన్ తరహాలో సాగుతుంది. ఈ దర్శకుడు గతంలో ‘ఆవారా’, ‘వెట్టాయ్’ మొదలుగు హిట్ సినిమాలను అందించాడు. ఆగష్టు 21 నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు
గతకొన్ని వారాలుగా సూర్య లింగుస్వామి సినిమాలో మొదట నటించాలా లేక గౌతంమీనన్ సినిమాలో నటించాలా అన్ని సందిగ్ధదలో వున్నాడు. చివరికి గౌతం మీనన్ సినిమాలో తారల ఎంపిక ఇంకా పూర్తికాలేదు కనుక లింగుస్వామి సినిమాను మొదలుపెట్టాలను నిశ్చయించాడు. సమంతకి ఈ సినిమా తన తమిళ కెరీర్ లోనే భారీ ప్రాజెక్ట్ కానుంది. దక్షిణాదిన ఇద్దరు అగ్రతారల నడుమ జరగనున్న ఈ ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారనుంది