ఆ రెండు పాటల్లో ఎన్.టి.ఆర్ స్టెప్పులు అదుర్స్

NTR-in-Baadshah
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సరికొత్త స్టైలిష్ అవతారంలో కనిపించనున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘బాద్షా’. మామూలుగా సాలిడ్ మాస్ డైలాగులు, పంచ్ డైలాగులు చెప్పడంలో దిట్ట అనిపించుకున్న ఎన్.టి.ఆర్ వేసే డాన్సుల గురించి ఫ్యాన్స్ కి, సినీ ప్రేమికులకి పెద్దగా చెప్పనక్కర్లేదు.. ‘బాద్షా’ ఆడియో ఆల్బమ్ లో మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చిన ‘బంతి పూల జానకి’, ‘రంగోలి రంగోలి’ పాటల్లో ఎన్.టి.ఆర్ డాన్సులు అదరగొట్టాడని సమాచారం. దీని ప్రకారం ఏప్రిల్ 5న విడుదల కానున్న ఈ సినిమాతో ఎన్.టి.ఆర్ తన పంచ్ డైలాగ్స్, డాన్సులతో అభిమానులకి ట్రీట్ ఇవ్వనున్నాడని తెలుస్తోంది.

శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మించారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ఎస్.ఎస్ థమన్ సంగీతం అందించాడు.

Exit mobile version