‘భీమవరం బుల్లోడు’ సక్సెస్ పై నమ్మకంగా ఉన్న సునీల్

‘భీమవరం బుల్లోడు’ సక్సెస్ పై నమ్మకంగా ఉన్న సునీల్

Published on Feb 10, 2014 11:24 AM IST

Sunil-In-Bheemavaram-Bullod

కమెడియన్ నుంచి కామెడీ హీరోగా టికెట్ కొట్టేసిన సునీల్ హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ‘తడాఖా’ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని చేసిన సినిమా ‘భీమవరం బుల్లోడు’. ఈ సినిమా సక్సెస్ విషయంలో సునీల్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ‘ ‘మర్యాద రామన్న’ తర్వాత స్క్రిప్ట్ వినగానే హిట్ అవుతుందని నమ్మి చేసిన సినిమా ‘భీమవరం బుల్లోడు’ అని’ సునీల్ తెలిపాడు.

అలాగే ఈ చిత్ర డైరెక్టర్ కూడా ఈ సినిమా కచ్చితంగా హిట్ అయ్యి తనకి మళ్ళీ బ్రేక్ వస్తుందని నమ్మకంగా ఉన్నారు. ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ లో సునీల్ సరసన ఎస్తర్ హీరోయిన్ గా నటించింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో డి. సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. సెన్సారు బోర్డు నుండి ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు