సందీప్ కిషన్ ‘రా రా కృష్ణయ్య’ చిత్రబృందం పై దాడులు

Sandeep.telugumovie.co_-289
గతంలో ‘రొటీన్ లవ్ స్టొరీ’ సినిమాలో జంటగా నటించిన సందీప్ కిషన్ మరియు రెజినా మరోసారి ‘రా రా కృష్ణయ్య’ సినిమాకోసం జతకట్టనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈరోజు కేరళలో ఒక గుడిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు అనుకోని అవాంతరం ఎదురైంది. ఈ సినిమా బృందాన్ని ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలు అడ్డుకుని సినిమా దర్శకుడిని సందీప్ కిషన్ మేనేజర్ పై దాడిచేసారు. అయతే వెంటనే సందీప్ మరియు రాజీనా ను అక్కడనుండి తరలించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో సందీప్ స్వయంగా ప్రకటించారు. కృష్ణ వంశీ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన మహేష్ ఈ సినిమాకు దర్శకుడు. వంశీ కృష్ణ శ్రీనివాస్ నిర్మాత

Exit mobile version