దుబాయ్‌లో సుకుమార్-చరణ్ స్క్రిప్ట్ డిస్కషన్..?

ramcharan-sukumar

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబా సానా డైరెక్షన్‌లో ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కంచనున్నాడు.

ఈ క్రేజీ కాంబో మళ్లీ సెట్ కావడంతో సుకుమార్ ఎలాంటి కథను తీసుకొస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, సుకుమార్ అండ్ టీమ్ ప్రస్తుతం ఈ చిత్ర స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ స్క్రిప్టు వర్క్ కోసం సుకుమార్ దుబాయ్‌కి వెళ్లారు. కాగా, రీసెంట్‌గా రామ్ చరణ్ కూడా దుబాయ్ వెళ్లి సుకుమార్‌తో డిస్కషన్స్ జరిపినట్లు తెలుస్తోంది.

అంతేగాక, ఇప్పుడు ‘పెద్ది’ చిత్ర నెక్స్ట్ షెడ్యూల్ కోసం కూడా మళ్లీ దుబాయ్ వెళ్లనున్నాడు చరణ్. దీంతో అక్కడ సుకుమార్, చరణ్ మరోసారి స్క్రిప్ట్ డిస్కషన్స్ జరపడం ఖాయమని తెలుస్తోంది.

Exit mobile version