బుజ్జి మగాడు షూటింగ్ లో బిజీగా వున్నాడు

Sudheer Babu (22)
‘ప్రేమ కధా చిత్రమ్’ విజయం సాధించి ఈమధ్యే 50 రోజులు పూర్తిచేసుకున్న నేపధ్యంలో సుధీర్ బాబు రెట్టించిన ఉత్సాహంతో చిత్రబృందంతో కలిసి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు. ” ‘ప్రేమ కధా చిత్రమ్’ సినిమా పై నాకు నమ్మకం వుంది కానీ ఇంత గొప్ప విజయం సాధిస్తుందని ఎన్నడూ అనుకోలేదు. ఇంత ఘన విజయాన్ని అందించిన మీ అందరికీ ధన్యవాదాలు.. ఇది మీ విజయం కూడా” అని ట్వీట్ చేసాడు. ప్రస్తుతం సుధీర్ బాబు ‘ఆడు మగాడు రా బుజ్జి’ చిత్రం షూటింగ్ లో బిజీగా వున్నాడు. కొన్ని వారాల క్రితం మొదలైన ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరుపుకుంటుంది. సుధీర్ బాబుకు జంటగా అస్మితా సూద్ నటిస్తుంది. కృష్ణ రెడ్డి దర్శకుడు. సుబ్బారెడ్డి మరియు సిరాజ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ చక్రవర్తి సంగీత దర్శకుడు. ఈ సినిమానేకాక సుధీర్ బాబు చేతిలో మరో రెండు సినిమాలతో ఈ ఏడాది అంతా బిజీగా వుండనున్నాడు

Exit mobile version