బాహుబలికి ఆస్కార్ అవార్డ్స్ వస్తాయంటున్న సుబ్బరాజు

subbaraju

టాలీవుడ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’. ఈ సినిమా కోసం భారీ వ్యయంతో కూడిన పెద్ద పెద్ద సెట్స్ వేస్తున్నారు. ఇప్పటికే ఈ సెట్స్ చూసిన పలు ప్రముఖులు బాహుబలి టీంపై ప్రశంశల జల్లు కురిపించారు. ఇప్పుడు ఈ సినిమాలో ఓ పాత్ర చేస్తున్న నటుడు సుబ్బరాజు ఈ సినిమా సెట్స్ గురించి తెగ పొగిడేస్తున్నారు.

‘బాహుబలి లాంటి టీంతో పనిచెయ్యడం చాలా ఆనందంగా ఉంది. ప్రపంచ సినీ రంగంలో బాహుబలి ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. అలాగే ఆడియన్స్ ఎంత ఊహించుకొని సినిమాకి వచ్చినా వారి ఊహకు మించి ఈ సినిమాలో సెట్స్ ఉంటాయని నేను చాలెంజ్ చేసి చెబుతున్నాను. సబు సైరిల్ అధ్బుతమైన సెట్స్ రూపొందిస్తున్నాడు. అవార్డ్స్ ఇవ్వడానికి ఆస్కార్ వారు రెడీగా ఉండాలని’ సుబ్బరాజు ట్వీట్ చేసాడు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి అన్నదమ్ములుగా కనిపించనున్న ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్కా మీడియా బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version