ప్రభాస్ బర్త్ డే స్పెషల్ : స్టైల్, స్వాగ్‌కు కేరాఫ్ ‘రాజా సాబ్’

తెలుగు సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లిన పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, సినీ పరిశ్రమ నుంచి బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో డార్లింగ్ నటిస్తున్న సినిమా నుంచి అభిమానులకు సాలిడ్ ట్రీట్స్ ఇస్తున్నారు మేకర్స్. తాజాగా ‘ది రాజా సాబ్’ మూవీ నుండి ఓ అదిరిపోయే పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

స్టైల్, స్వాగ్‌కు కేరాఫ్‌గా నిలిచే మన ‘రెబల్ సాబ్’ అలియాస్ ‘ది రాజా సాబ్’కు బర్త్ డే విషెస్ అంటూ ఓ కలర్‌ఫుల్ ఫోటోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫోటోలో ప్రభాస్ లుక్స్ అల్ట్రా స్టైలిష్‌గా కనిపిస్తున్నాయి. ఇక ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెబుతున్నట్లు ఈ పోస్టర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తోంది.

ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని ఇప్పటికే మేకర్స్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో ఆయన పండించే కామెడీ నెక్స్ట్ లెవెల్ అని ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తుండగా 2026 జనవరి 9న వరల్డ్‌వైడ్ రిలీజ్‌కు రెడీ అయింది.

Exit mobile version