రానా ‘బాహుబలి’ వీడియోకి కళ్ళు చెదిరే స్పందన

రానా ‘బాహుబలి’ వీడియోకి కళ్ళు చెదిరే స్పందన

Published on Dec 14, 2013 10:00 PM IST

baahubali
టాలీవుడ్ మాచో హంక్ రానా జన్మదిన కానుకగా తను నటిస్తున్న ‘బాహుబలి’ సినిమా బృందం ఈ మేకింగ్ వీడియో ను విడుదలచేసింది. ఈ వీడియోలో రానా కండలు తిరిగిన దేహం చూసి సినిమా ప్రియులు ఆనందంతో ఉర్రుతలుగిపోతున్నారు

కేవలం 12గంటల వ్యవధిలో ఈ వీడియో 2 లక్షల వ్యూలను యు ట్యూబ్ లో సొంతం చేసుకుంది. ఈ సినిమా బృందం ఇప్పటివరకూ విడుదల చేసిన వీడియో దీనికే అత్యంత ప్రజాదరణ లభించిందని ఆనందంగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమా ప్రభాస్ సోదరుడిగా రానా ముఖ్యపాత్రను పోషిస్తున్నాడు

ఈ భారీ బడ్జెట్ సినిమాను రాజమౌళి తెరకేక్కిస్తున్నాడు. ఆర్కా మీడియా నిర్మిస్తున్న ఈ సినిమా 2015లో మనముందుకు రానుంది

‘బాహుబలి’లో రానా వీడియో కోసం క్రింద లింక్ ను క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు