టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన ‘కుబేర’ మరికొద్ది గంటల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాను పూర్తి క్రైమ్ థ్రిల్లర్ చిత్రంగా మేకర్స్ రూపొందించారు. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక లాంటి స్టార్ క్యాస్టింగ్ నటిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి.
ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తుండటంతో ఈ మూవీకి పలువురు స్టార్స్ బెస్ట్ విషెస్ చెబుతున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ ఈ చిత్రానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని వారు ధీమా వ్యక్తం చేశారు.
ఇక ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయమని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.