టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘గ్లోబ్ ట్రాటర్’ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఉన్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అనౌన్స్‌మెంట్ నవంబర్ 15న ఉండనుండటంతో అందరూ ఆ రోజు కోసం ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే, ఈ సినిమా నుండి సర్‌ప్రైజ్ ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఫస్ట్ సౌండ్ ఆఫ్ గ్లోబ్‌ట్రాటర్ అంటూ ఓ పాట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ పాటకు చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించగా కీరవాణి బాణీలు అందించారు. ఇక శ్రుతి హాసన్ ఈ పాటను పాడినట్లు తెలుస్తోంది. ఈ పాటలో హీరో పాత్రను ఎలివేట్ చేస్తూ సాగే లిరిక్స్ అదిరిపోయాయి.
ఇక ఈ సినిమాలో అందాల భామ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోండగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఎలాంటి వండర్స్ చేయనుందో చూడాలి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


