యష్ కోసం పిరియాడికల్ సబ్జెక్ట్ రెడీ చేసుకుంటున్న స్టార్ డైరెక్టర్ ?

యష్ కోసం పిరియాడికల్ సబ్జెక్ట్ రెడీ చేసుకుంటున్న స్టార్ డైరెక్టర్ ?

Published on Nov 9, 2020 8:07 AM IST

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు సందీప్ వంగ. ఈ చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి భారీ బ్లాక్ బస్టర్ అందుకుని అక్కడ స్టార్ డైరెక్టర్ అయిపోయారు. దీంతో అక్కడి నిర్మాతలు సందీప్ సినిమాలకు ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి ముందుకొస్తున్నారు. ప్రస్తుతం హిందీలో ఒక స్టార హీరోతో సినిమా చేస్తున్న ఈయన తాను డైరెక్ట్ చేయాల్సిన హీరోల జాబితాలో యష్ పేరును కూడ చేర్చుకుని ఉన్నారు. ‘కెజిఎఫ్’ హిట్టవ్వగానే యష్ తో సినిమా చేయాలని సందీప్ వంగ అనుకున్నారు.

కానీ ‘కెజిఎఫ్ 2’ ఉండటంతో ఆయన డేట్స్ కుదరలేదు. ఆ తర్వాత మహేష్ బాబు, ప్రభాస్ లాంటి హీరోలతో వర్క్ చేయాలని సందీప్ రెడ్డి ఆశించినా ఆ హీరోలకున్న కమిట్మెంట్స్ కారణంగా అవి సెట్ కాలేదు. అందుకే హిందీలో సినిమా చేయడానికి రెడీ అయ్యారు ఆయన. అది పోర్తవగానే మరోసారి యష్ ప్రాజెక్ట్ మీద దృష్టి పెడతారట. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మేరకు వీరి చిత్రం ఒక పిరియాడికల్ మూవీగా ఉండబోతుందని తెలుస్తోంది. మరి ఈ పిరియాడికల్ సబ్జెక్ట్ ఫిక్షన్ల్ స్టోరీనా లేకపోతే వాస్తవ చరిత్ర ఆధారంగా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు