ఫోటో మూమెంట్ : శ్రీలీల ట్విస్టు మామూలుగా ఇవ్వలేదుగా.. !

యంగ్ బ్యూటీ శ్రీలీల చేసే సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక ఆమెకు సోషల్ మీడియాలోనూ సాలిడ్ ఫాలోయింగ్ ఉంది. ఆమె పెట్టే ప్రతి పోస్టుకు ఫాలోవర్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. అయితే, ఆమె తన ఇన్‌స్టాలో ఓ ఫోటో పెట్టి అభిమానులను అవాక్కయ్యేలా చేసింది. శ్రీలీలకు ఆమె కుటుంబ సభ్యులు పసుపు, గంధం పెడుతున్న ఫోటోను తన స్టోరీగా పెట్టి.. కమింగ్ సూన్ అంటూ ఆమె క్యాప్షన్ ఇచ్చింది. దీంతో శ్రీలీల ఏదైనా గుడ్ న్యూ్స్ చెప్పబోతుందా అని అందరూ అనుకున్నారు.

కట్ చేస్తే.. శ్రీలీల ఇంట ఆమె ప్రీ-బర్త్‌డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. తన తల్లి కోరిక మేరకు ఈ ప్రీ-బర్త్ డే వేడుకను సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. పెళ్లి కూతురును చేసిన విధంగా శ్రీలీలను కూడా పసుపు స్నానాలతో అలంకరించి, ఆమెను బుట్టలో తీసుకుని వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఆమె తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

ఈ ఫోటోలు చూసి అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆమె పెళ్లికి సంబంధించి ఏదైనా వార్త చెబుతుందని అనుకున్నవారికి శ్రీలీల మామూలు ట్విస్టు ఇవ్వలేదుగా అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version