స్పెయిన్ షెడ్యూల్లో ‘రామయ్యా వస్తావయ్యా’

Ramayya-Vasthavayya1
‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలోని రెండు పాటలను స్పెయిన్ లో తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ప్రొడక్షన్ టీం స్పెయిన్ చేరుకొని ఈ పాటల షూటింగ్ కు కావాల్సిన ఏర్పాట్లను పూర్తిచేసింది. వీటిల్లో ఒక పాత ఎన్.టి.ఆర్ సమంత మధ్యన సాగగా మరొకటి ఎన్.టి.ఆర్, శృతిహాసన్ నడుమ తెరకెక్కనుంది

ముందుగా చెప్పినట్టే ప్రొడక్షన్ టీం పాటలకు సరిపడే అద్భుతమైన లొకేషన్లను వెతికిపెట్టింది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడు

ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ ను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా సెప్టెంబర్ చివరివారంలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ఒక పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని అంచనా

Exit mobile version