మహేష్ బాబుతో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్న సోనమ్ కపూర్

మహేష్ బాబుతో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్న సోనమ్ కపూర్

Published on Sep 1, 2013 12:10 PM IST

Mahesh-and-sonam
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ వరుసగా ‘రంఝానా’, ‘భాగ్ మిల్కా భాగ్’ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకొని ఖుషీ ఖుషీగా ఉంది. తాజాగా హైదరాబాద్ లో ఓ ప్రమోషనల్ ఈవెంట్ కి హాజరైన ఈ భామ తనకి టాలీవుడ్ లో పనిచేయాలని ఉందని, తను ‘రంఝాన’ లో చేసిన పూర్తి ప్రాముఖ్యత ఉన్న పాత్రలు వస్తే చేస్తానని తెలిపింది. తనకి టాలీవుడ్ లో చాలా ఆఫర్స్ వస్తున్నాయి కానీ తనకి మన భాష రాకపోవడం వల్లే ఇక్కడి సినిమాలు ఒప్పుకోవడం లేదని తెలిపింది.

సోనమ్ కపూర్ మాట్లాడుతూ ‘ నా డ్రీం టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుతో సినిమా చేయాలన్నది నా కోరిక. అతని లూక్స్ చాలా బాగుంటాయని’ తన మనసులో మాటని బయటకి చెప్పేసింది. గత కొన్ని రోజులుగా మహేష్ బాబు సరసన సోనమ్ కపూర్ నటిస్తోందని గాలి వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సోనమ్ కూడా తన మసులోని మాట చెప్పడం వల్ల తన కోరిక కూడా త్వరలోనే నిజమవుతుందని ఆశిద్దాం.

తాజా వార్తలు