జటాధర కోసం సోనాక్షి డెడికేషన్..!

jatdhara

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న “జటాధర” చిత్రంతో ఆమె టాలీవుడ్‌లోకి అడుగుపెడుతుంది. నవంబర్ 7న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో సోనాక్షి లేడీ విలన్‌గా కనిపించనుంది. ఈ పాత్ర కోసం ఆమె కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడిన సోనాక్షి ఈ సినిమాలో తన పాత్ర కోసం ఏకంగా 50 కిలోల బరువైన ఆభరణాలు ధరించాల్సి వచ్చిందని తెలిపింది. తన కెరీర్‌లో అత్యంత శారీరక శ్రమతో కూడిన పాత్రల్లో ఒకటని.. ప్రతిరోజూ షూటింగ్‌కి సిద్ధమవ్వడానికి మూడు గంటలు పట్టేదని ఆమె తెలిపింది.

చీరపై హార్నెస్‌ వేసుకుని, దాని మీదే ఆభరణాలు కుట్టి వేసేవాళ్లని.. అవి యాక్షన్ సన్నివేశాల్లో కదలకుండా ఉండేందుకు అలా కుట్టేవారని ఆమె తెలిపింది. అంత బరువైన ఆభరణాలతో గంటల తరబడి షూటింగ్ చేయడం చాలా కష్టంగా అనిపించినా, సినిమా కోసం చేశానంటూ ఆమె చెప్పుకొచ్చింది.

Exit mobile version