మన టాలీవుడ్ దిగ్గజ హీరోస్ లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి హీరోగా చాలా కాలం తర్వాత ఓ సాలిడ్ ఎంటర్టైనర్ గా చేస్తున్న చిత్రమే “మన శంకర వరప్రసాద్ గారు”. దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పట్ల మంచి బజ్ ఆల్రెడీ ఉండగా ఫ్యామిలీ ఆడియెన్స్ లో ఈ సినిమా గట్టిగా వర్కౌట్ అవుతుంది అని చాలా మంది భావిస్తున్నారు.
ఇక ఇందుకు తగ్గట్టుగానే రెండు తెలుగు స్టేట్స్ లో ఈ సింపుల్ చిత్రానికి కూడా డిమాండ్ గట్టిగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. మేకర్స్ ఈ సినిమా కేవలం థియేట్రికల్ హక్కులే 100 కోట్లకి పైగానే కోట్ చేస్తున్నట్టుగా ఇపుడు సినీ వర్గాల్లో బజ్ వినిపిస్తుంది. ఈ సినిమాలో చాలానే సర్ప్రైజ్ లు కూడా ఉన్నట్టు టాక్ ఉంది. ఎలాగో చిరంజీవిని మంచి ఎంటర్టైనర్ లో చూసి కూడా చాలా కాలం అయ్యింది. మరి ఏమాత్రం ఈ సినిమా వర్కౌట్ అయ్యినా సంక్రాంతి రేస్ లో గట్టిగానే ఉంటుంది అని చెప్పవచ్చు.