తెలుగులో అనువాదంకానున్న స్నేహ సినిమా

తెలుగులో అనువాదంకానున్న స్నేహ సినిమా

Published on Aug 31, 2013 11:02 AM IST

sneha
తమిళ మరియు తెలుగు సినిమాలలో పెద్దతారలందరితో నటించిన నటి స్నేహ పెళ్లి తరువాత నటించబోయే సినిమాలలో పాత్ర ఎంపికకు తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆమె ఇటీవలే నటించిన ‘హరిదాస్’ సినిమా తమిళ్ లో భారీ విజయం సాధించింది. ఇదే సినిమా ‘మానాన్న పోలీస్’ పేరుతొ తెలుగులో అనువాదంకానుంది. ఈ సినిమాకు జి.ఎన్.ఆర్ కుమారవేలన్ దర్శకుడు. డా: రామ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా రామ్ దాస్ నిర్మాత. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ “హృదయానికి హత్తుకునే కధ ఇది. మందమతి కలిగిన ఒక బాలుడి చుట్టూ తిరిగే ఈ కధలో ఆ అబ్బాయి తన కష్టాలను ఎలా అధిగమించి విజయం సాధించాడన్నది కధాంశం. ఈ ఆటిజంతో బాధపడుతున్న వారు ప్రపంచంలో నలుమూలలా వున్నారు. సచిన్ టెండూల్కర్ మరియు అబ్దుల్ కలాం కూడా చిన్నప్పుడు ఈ ఆటిజంతో బాధపడినవారే” అని తెలిపారు

ఈ సినిమాలో స్నేహ, కిషోర్ మరియు ప్రదీప్ రావత్ ముఖ్యపాత్రధారులు. స్నేహ టీచర్ పాత్రను పోషించగా, కిషోర్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రను పోషించాడు. ఈ సినిమా త్వరలో విడుదలకానుంది

తాజా వార్తలు