షూటింగ్స్ పై ఆలోచనలో పడ్డ చిన్న నిర్మాతలు !

నెలలు గడుస్తోన్న కరోనా మహమ్మారి తీవ్రత పెరుగుతూనే ఉంది గాని తగ్గట్లేదు. ఈ క్రమంలో పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారనేది సర్వసాధారణమైన విషయం అయిపోయింది. ముఖ్యంగా సినిమా రంగం పై కరోనా పంజా విసిరింది. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్‌ తో థియేటర్స్‌ అన్ని మూసేశారు. మొన్నటి వరకూ సినిమాల షూటింగ్ లు ఆపేశారు. దాంతో కృష్ణ నగర్ కష్టాలు సినిమా పక్షుల్లో ఎక్కువైపోయాయి. చిన్న నిర్మాతల దగ్గర నుండి జూనియర్ ఆర్టిస్ట్ లు వరకూ అందరూ తీవ్రంగా ఆర్ధిక ఇబ్బందులను ఎగురుకుంటున్నారు.

దీనికి తోడు ప్రస్తుతం హైదరాబాద్ లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. షూటింగ్ లు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. దాంతో పెద్ద నిర్మాతల దగ్గర నుండి చిన్న నిర్మాతల వరకూ ఎక్కువ జాగ్రతలు తీసుకోవాల్సి ఉంది. దీంతో ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ కానుంది. ఇంత ఖర్చు పెట్టి సినిమా తీసినా సినిమా రిలీజ్ గురించి ఇంకా క్లారిటీ లేదు. పైగా షూటింగ్స్ అంటే వందలమందితో చేయాల్సన పని. ఈ నేపథ్యంలో సినిమాల షూటింగ్స్ చిన్న నిర్మాతలు వెనక్కి తగ్గుతున్నారు.

Exit mobile version