చిన్న సినిమా.. పెద్ద విజయం దిశగా ‘లిటిల్ హార్ట్స్’

ఈ ఫ్రైడే తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో చిన్న చిత్రం “లిటిల్ హార్ట్స్” కూడా ఒకటి. ఘాటి ఇంకా మదరాసి లాంటి సినిమాలు ఉన్నప్పటికీ తమ మార్క్ ప్రమోషన్స్ ని చేసుకొని అందరి దృష్టిని లిటిల్ హార్ట్స్ టీం అందుకున్నారు. ఇలా రిలీజ్ కి వచ్చిన ఈ సినిమాకి సాలిడ్ రెస్పాన్స్ ఇపుడు థియేటర్స్ లో చూసిన ఆడియెన్స్ నుంచి వస్తుంది.

ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమాకి హౌస్ ఫుల్స్ కూడా పడుతున్నాయి. దీనితో లిటిల్ హార్ట్స్ చిత్రం పెద్ద విజయం అందుకున్నట్టే అని చెప్పాలి. ఇక బుకింగ్స్ పరంగా కూడా లిటిల్ హార్ట్స్ మంచి రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది. దీనితో ఈ వీకెండ్ కి మంచి క్యాష్ ని ఈ సినిమా చేసుకునే అవకాశం ఉంది. సో మొత్తానికి మాత్రం మౌళి అండ్ టీం తమ డెబ్యూ వర్క్ లో హిట్ కొట్టేసినట్టే అని చెప్పవచ్చు.

Exit mobile version