నటి అనుష్క నటిస్తున్న సినిమా ‘బాహుబలి’ . ఎంతో ప్రతితాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆమె బలంగా కనిపించడానికి వ్యాయామాలు చేస్తోంది. ఈ సినిమాతో పాటు ఆమె పీరియడ్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘రుద్రమదేవి’ సినిమాలో కూడా నటిస్తోంది. ఆమె చేస్తున్న ట్రైనింగ్, వ్యాయామాలు చూస్తుంటే ఈ సినిమాలలో అనుష్క పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉందనిపిస్తోంది. ప్రస్తుతం తను చాలా బలంగా, స్లిమ్ గా కనిపిస్తోంది. తన ముఖం కొత్తగా, అందంగా మారుతూ వచ్చింది . ఈ సినిమాలలో అనుష్క కొత్త అవతరంలో ఫాన్స్ కు కనిపించనుంది. ‘బాహుబలి’ రెగ్యులర్ షూటింగ్ ఇంకా కొన్ని వారాలలో మొదలవుతుంది అని సమాచారం. అనుష్క ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తోంది. రానా దగ్గుపాటి ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ రెండు సినిమాలలో ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నాడు.