ఈ విషయంలో మాత్రం ‘రంగమార్తాండ’ గొప్పగా ఉండబోతుంది

సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ త్వరలో ‘రంగమార్తాండ’ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ నగరంలో జరుగుతోంది. ఈ చిత్రాన్ని కృష్ణవంశీ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. నటీనటుల నుండి అన్ని విషయాల్లో సినిమా గొప్పగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే సంగీతాన్ని ఇళయరాజాగారి చేత చేయించుకుంటున్నారు.

టైటిల్ కి తగ్గట్టే సినిమాలో సాహిత్యం కూడ హుందాగా ఉండేలా చూసుకుంటున్నారు కృష్ణ వంశీ. ఇందుకోసం సుప్రసిద్ధ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి వద్ద పాటలు రాయించుకుంటున్నారు. ఈ విషయాన్నే చెబుతూ గురూజీ మొదలుపెట్టారు. అద్భుతమైన పాటలు ప్రాణం పోసుకుంటున్నాయి అన్నారు కృష్ణవంశీ. మరి ఆయన అంతలా చెబుతుండటం, అవతల ఉన్నది సీతారామశాస్త్రిగారు కాబట్టి పాటలు గొప్పగా ఉంటాయనే నమ్మకం పెట్టేసుకోవచ్చు. ఈ చిత్రాన్ని మధు కలిపు, అభిషేక్ జవ్కర్ కలిసి నిర్మిస్తున్నారు. మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్’కు ఇది రీమేక్. ఇందులో రమ్యకృష్ణ, ప్రకాష రాజ్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు.

Exit mobile version