అది పాట కాదు నా జీవితం – సిరివెన్నెల

Sirivennela
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగుదనానికి అద్భుతమైన సాహిత్యంతో వన్నె తెచ్చే అతి కొద్దిమంది పాటల రచయితలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒకరు. హృదయానికి హత్తుకునే ప్రేమ గీతాల్ని అయినా, ఆధ్యాత్మిక పాటలైనా, ప్రజల్ని చైతన్య వంతుల్ని చేసే విప్లవ గీతాలైనా.. ఇలా ఏ పాటనైనా ప్రశ్నల రూపంలో కూడా రాసి మెప్పించవచ్చు అని నిరూపించి కొత్త ఒరవడిని సృష్టించిన ఘనత సిరివెన్నెలకే దక్కుతుంది.

ఆయన ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గీత రచయితగా ఎన్నో అద్భుతమైన పాటలని రాసి ఎంతో పేరు తెచ్చుకున్నారు. అలాంటి మీకు పద్మశ్రీ రాలేదని ఎప్పుడన్నా బాధపడ్డారా అని అడిగితే ‘ మెడల్ కోసం మెడలు వంచడం నాకు చేతకాదు. నేను ఏనాడు పద్మశ్రీ ఆశించి పాట రాయలేదు. దానిపై నాకు ఆసక్తి కూడా లేదు. ‘నేను జగమంత కుటుంబం నాది’ అనే పాట రాశాను. తాము రాసిన పాట ఎంతమంది రచయితల్లో నిజమై ఉంటుంది కానీ నా జీవితంలో మాత్రం నిజమైంది. ఎంతో మంది అభిమానుల్ని, కొన్ని కోట్ల మంది కుటుంబాల్లో ఒకడినయ్యాను. అంతకన్నా గొప్ప అవార్డు ఇంకేమన్నా ఉంటుందా? అందుకే నేను ‘జగమంత కుటుంబం నాది’ పాట కాదు నా జీవితం అని అంటుంటానని’ సీతారామ శాస్త్రి సమాధానం ఇచ్చాడు.

Exit mobile version