జర్మనీలో చిందేస్తున్న కాజల్-రవితేజ-రిచా

జర్మనీలో చిందేస్తున్న కాజల్-రవితేజ-రిచా

Published on Aug 11, 2012 9:26 AM IST


మాస్ మహారాజ రవితేజ హీరోగా, కాజల్ అగర్వాల్ మరియు రిచా గంగోపాధ్యాయ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సార్ ఒస్తారా’. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ జర్మనీలో జరుగుతోంది. ఈ చిత్ర షెడ్యూల్ ఇటీవలే ఇటలీలో ప్రారంభమైంది. అక్కడ 12 రోజులు చిత్రీకరణ జరుపుకున్న తర్వాత మిగిలిన షెడ్యూల్ పూర్తి చెయ్యడం కోసం ఈ చిత్ర యూనిట్ జర్మనీకి చేరుకున్నారు. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశ్వనీ దత్ నిర్మిస్తున్నారు. విజయ్ కేశవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలోని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిన తర్వాత రవితేజ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించనున్న ‘బలుపు’ చిత్ర చిత్రీకరణలో పాల్గొంటారు. రవితేజ హీరోగా నటించిన ‘ దేవుడు చేసిన ముషులు’ చిత్రం ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు