‘తెలుసు కదా’.. స్టార్ బాయ్ ముగించేశాడు..!

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘తెలుసు కదా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను నీరజ కోన డైరెక్ట్ చేస్తుండగా అందాల భామలు రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీంతో ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే, ఈ సినిమాను ట్రయాంగిల్ లవ్ స్టోరీగా మేకర్స్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్‌ను చిత్ర యూనిట్ ముగించారు. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ సభ్యులు కేక్ కట్ చేసి చిత్ర షూటింగ్ ముగిసిందని తెలియజేశారు.

దీంతో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా మారనుంది. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 17న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

Exit mobile version