సిద్దార్థ్ త్వరలో “ఉదయం -NH 4” అనే చిత్రంలో కనిపించనున్నారు. అయన నటిస్తున్న మొదటి యాక్షన్ చిత్రం ఇదే ఈ చిత్రం గురించి ఈ నటుడు ఇప్పటికే చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు వెట్రి మారన్ స్క్రిప్ట్ అందించగా మణిమారన్ దర్శకత్వం వహిస్తున్నారు. అషిత శెట్టి ఈ చిత్రంలో సిద్దార్థ్ సరసన కనిపించనుంది. ఈ చిత్రంలో చాలా భాగం చెన్నై నాలుగవ జాతీయ రహదారి మీద చిత్రీకరణ జరుపుకుంది. జి వి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందించగా వేసవికి ఈ చిత్రం తెలుగు మరియు తమిళంలో విడుదల కానుంది. ఇదిలా ఉండగా త్వరలో రానున్న సిద్దార్థ్ తెలుగు చిత్రం “జబర్దస్త్” చిత్ర ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత మరియు నిత్య మీనన్ లు ముఖ్య భూమికలు పోషించారు . ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకి రానుంది.