జబర్దస్త్ చిత్ర విజయం మీద ధీమాగా ఉన్న సిద్దార్థ్

Siddharth_Sukumarudu
సిద్దార్థ్, సమంత మరియు నిత్య మీనన్ ప్రధాన పాత్రలలో రానున్న “జబర్దస్త్” చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మించారు. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల చివరి దశ జరుపుకుంటుంది. ఈ చిత్ర ఫైనల్ కట్ చుసిన సిద్దార్థ్ ఈ చిత్రం గురించి చాలా విషయాలు చెప్పారు. “ఈరోజు “జబర్దస్త్” చిత్రాన్ని చూసాను నందిని రెడ్డి నాకు తెలుగులో మరో పెద్ద విజయాన్ని అందించింది అని చెప్పాలి. “అలా మొదలైంది” చిత్రం తరువాత ఈ చిత్రం కోసం నన్ను ఎంచుకోవడం నాకు సంతోషంగా ఉంది. ఈ చిత్రం ఏం సాదించినా అది పూర్తిగా నందిని రెడ్డికి చెందుతుంది.” అని అన్నారు. “గోల్డెన్ గర్ల్ సమంత మా చిత్రంలో ఉండటం ఈ చిత్రం కచ్చితంగా హిట్ అని చెప్తుంది ఇప్పటి వరకు ఆరు విజయాలు అందుకున్న సమంత ఈ చిత్రంతో 7వ విజయం అందుకోనుంది” అని జతచేశారు. ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా జనవరి 27న ఈ చిత్ర ఆడియో విడుదల చెయ్యనున్నారు.

Exit mobile version