సిద్దార్థ్ మరియు హన్సిక మరోసారి జతకట్టనున్నారు గతంలో వీరు ఇద్దరు వేణు శ్రీరాం దర్శకత్వంలో “ఓ మై ఫ్రెండ్” చిత్రంలో నటించారు. వీరిద్దరూ త్వరలో సుందర్ సి దర్శకత్వంలో రానున్న ద్విభాషా చిత్రంలో నటించనున్నారు. తమిళంలో “తీయ వేలై సేయ్యుం కుమారు” అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెలుగులో ఇంకా పేరు ఖరారు కాలేదు.రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకేక్కబోయే ఈ చిత్రంలో గణేష్ వెంకటరామన్ ఒక ప్రధాన పాత్ర పోషించనున్నారు, సంతానం ఒక ముఖ్య భూమిక పోషించనున్నారు. కుష్బూ సుందర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్ర చిత్రీకరణ జనవరిలో మొదలు కానుంది. ప్రస్తుతం సిద్దార్థ్, నందిని రెడ్డి చిత్రాన్ని ముగించే పనిలో ఉన్నారు. అంతే కాకుండా మణికంటన్ దర్శకత్వంలో రానున్న NH 4 అనే చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. కార్తి ప్రధాన పాత్రలో వస్తున్న “బిరియాని” చిత్ర చిత్రీకరణలో హన్సిక పాల్గొంటుంది.