రేసు గుర్రం కోసం పాట పాడిన శృతి హాసన్

రేసు గుర్రం కోసం పాట పాడిన శృతి హాసన్

Published on Feb 19, 2014 3:00 PM IST

Shruti_Hassan
హాట్, స్టైలిష్ శృతి హాసన్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రేసు గుర్రం’లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ నటించడమే కాకుండా ఓ పాట కూడా పాడింది. ఆ పాటే ‘డౌన్ డౌన్ డుప్ప’. థమన్ కంపోజ్ చేసిన ఈ పాత షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

శృతి హాసన్ హీరోయిన్ గా పరిచయం కాకముందు బాలీవుడ్ మరియు తమిళ్ లో సూపర్ హిట్ సాంగ్స్ పాడింది. ఇప్పుడు శృతి పాడిన పాట సినిమాలోనే స్పెషల్ అట్రాక్షన్ అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కిక్ శ్యాం, సలోని ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి నల్లమలపు బుజ్జి నిర్మాత.

తాజా వార్తలు