షాకింగ్.. మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ నుంచి వీడియో లీక్?

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో కూడా ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కూడా కావడంతో వరల్డ్ వైడ్ కూడా గట్టి అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ చిత్రం నుంచే అంటూ రీసెంట్ గానే భారీ సెట్టింగ్ పిక్స్ వచ్చాయి కానీ ఇది నిజంగా ఈ సినిమా లోనిదే అని క్లారిటీ లేదు కానీ ఇపుడు మాత్రం సినిమా నుంచే ఏకంగా వీడియో బయటకి వచ్చేసి షాకిచ్చింది. దీనితో ఇది ఊహించనిది గా మారింది. అది కూడా మహేష్ బాబుపైనే విజువల్స్ ఇవి కావడంతో సోషల్ మీడియాలో వెంటనే వైరల్ గా మారిపోయాయి.

మరి వీటిపై రాజమౌళి నుంచి ఎలాంటి యాక్షన్ ఉంటుందో చూడాలి. ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇది ఇలాంటి వెంటనే ఇలా లీక్స్ అవ్వడం అనేది బాధాకరం మరి చిత్ర యూనిట్ ఎలాంటి యాక్షన్ వీటిపై తీసుకుంటారో చూడాలి.

Exit mobile version