చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. బాలకృష్ణ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన టైటిల్‌తో శర్వానంద్ వస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఢోకా ఉండదని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.
తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను మేకర్స్ లాక్ చేశారు. సంక్రాంతి కానుకగా 2026 జనవరి 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే, వెరైటీగా ఈ చిత్రాన్ని మార్నింగ్ షోలతో కాకుండా సాయంత్రం 5.49 గంటలకు థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై బజ్ మరింత పెరిగింది.
ఇక ఈ సినిమాలో అందాల భామలు సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
