‘రోబో’ తర్వాత నా డ్రీం ప్రాజెక్ట్ ఇదే అంటున్న శంకర్.. హాట్ డిస్కషన్స్

ఇండియన్ సినిమా దగ్గర ప్రైడ్ ఇండియన్ దర్శకులు ఇపుడు చాలామందే కనిపిస్తారు. ఇప్పుడు అయితే ఇండియన్ సినిమా దగ్గర నెంబర్ 1 దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అని అందరికీ తెలిసిందే. మరి అలాంటి దర్శకుడే తనకి కూడా ‘ఓజి’ దర్శకుడు ఎవరు అంటే మావెరిక్ దర్శకుడు శంకర్ అనే చెప్పిన సందర్భం ఉంది.

అలనాటి స్టాండర్డ్స్ ని సెట్ చేసుకున్న శంకర్ ఇప్పుడు స్ట్రగుల్ అవుతున్నారు. టెక్నికల్ గా ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపించే శంకర్ నుంచి వచ్చిన ఎన్నో వండర్స్ లో ‘రోబో’ కూడా ఒకటి. అయితే లేటెస్ట్ గా శంకర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తనకి ఒకప్పుడు రోబో సినిమా డ్రీం ప్రాజెక్ట్ అయితే ఇపుడు తనకి ‘వేళ్పారి’ సినిమా డ్రీం ప్రాజెక్ట్ అని కామెంట్స్ చేశారు.

ఈ సినిమా కొత్త ఒక ప్రౌడ్ ఇండియన్ తమిళ్ సినిమాగా నిలుస్తుంది అని ఈ సినిమా ద్వారా అవతార్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ తరహాలో కొత్త టెక్నాలజీలని పరిచయం చేసే స్కోప్ ఉందని అనౌన్స్ చేశారు. అయితే దీనిపై ఆల్రెడీ హాట్ డిస్కషన్స్ మొదలయ్యాయి. శంకర్ మళ్ళీ డబ్బులు వేస్ట్ చేయబోతున్నారని, 24 గంటల ఫుటేజ్ తీయబోతున్నారని ఇలా పలు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version