సరికొత్త షారుఖ్.. ‘కింగ్’ గ్లింప్స్ తో హాట్ టాపిక్ గా

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా వరుస హిట్స్ తర్వాత దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ప్రాజెక్ట్ కోసం అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి కింగ్ అనే టైటిల్ ఇది వరకే ఫిక్స్ అయ్యినట్టు బజ్ ఉంది. కానీ ఫైనల్ గా అదే టైటిల్ ని నేడు తన పుట్టినరోజు కానుకగా మేకర్స్ ఓ వైల్డ్ యాక్షన్ గ్లింప్స్ విడుదల చేసారు.

అయితే ఇందులో ప్రెజెంట్ చేసిన సరికొత్త షారుఖ్ కోసమే సోషల్ మీడియా అంతా హాట్ టాపిక్ గా నడుస్తోంది. షారుఖ్ లుక్ గాని తన యాక్షన్ పార్ట్ కానీ సిద్ధార్థ్ ఆనంద్ యూనిక్ గా ప్రెజెంట్ చేయడంతో ఇదే మంచి చర్చగా మారింది. అయితే ఇందులో షారుఖ్ మొత్తం ఇదే లుక్ లో ఉంటాడా లేక జవాన్ తరహాలో డ్యూయల్ షేడ్స్ ఉంటాయా అనేది వేచి చూడాల్సిందే. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ కి మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version