ఉగాదికి రిలీజ్ ప్లాన్ చేస్తున్న షాడో టీం

shadow-poster
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘షాడో’. సమ్మర్ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఈ సినిమాని ఉగాది కానుకగా అనగా ఏప్రిల్ 11న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ద్వారా రిలీజ్ డేట్ సమాచారం తెలిసింది.

మెహెర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ సరికొత్త స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడు. గోపి మోహన్ – కోనా వెంకట్ స్క్రిప్ట్ అందించిన ఈ సినిమాకి శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రాఫర్, ఎస్.ఎస్ థమన్ సంగీతం అందించాడు.

Exit mobile version