మన ఆంధ్ర ప్రదేశ్లో చాలా అమంది ఫాన్స్ తమకు ఇష్టమైన హీరోలను దైవ సమానులుగా భావిస్తారు. అలా భారీ ఫాలోయింగ్ ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఫాన్స్ తమ హీరోపై ఉన్న అభిమానాన్ని పలురకాలుగా చూపిస్తుంటారు. కానీ ఒక ప్రొడ్యూసర్ లేదా అతని ఫ్యామిలీ సభ్యులు తను ఇష్టపడే హీరో కోసం ఇలా చేసి ఉండరు? ఇంతకీ ఎవరు ఏమి చేసారు అనుకుంటున్నారా..!
అతనెవరో కాదండి మనకు బాగా పరిచయమున్న నిర్మాత బండ్ల గణేష్ గారి తమ్ముడు శివబాబు బండ్ల. ఇతను పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. ‘గబ్బర్ సింగ్’ రిలీజ్ కాకముందు సినిమా హిట్ అయితే ‘షాద్ నగర్ నుంచి శ్రీ శైలం నడిచి వస్తానని మొక్కుకున్నాడు. ఆ తర్వాత ‘గబ్బర్ సింగ్’ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి రికార్డ్స్ బద్దలు కొట్టిన సంగతి మనకు తెలిసిందే.
దాంతో శివబాబు బండ్ల అన్న మాట ప్రకారం కొన్ని రోజుల క్రితం షాద్ నగర్ నుండి శ్రీశైలం నడిచి వెళ్ళారు. సుమారు 205 కిలోమీటర్ల దూరాన్ని ఆయన కేవలం నాలుగు రోజుల్లో పూర్తి చేసేసారు. ఇలాంటి సంఘటనలు ఒక్క మన ఇండియాలోనే జరుతుంటాయి ఫ్రెండ్స్..