మరో నటుడికి కరోనా..!

హైదరాబాద్ లో కరోనా ప్రభావం తీవ్ర స్థాయికి చేరింది. అక్కడ రోజుకి వందల్లో కేసులు నమోదుకావడంతో పాటు, సామాన్యులు మరియు సెలెబ్రిటీలు అనే తేడా లేకుండా దీని బారిన పడుతున్నారు. ఇక టాలీవుడ్ తో పాటు బుల్లి తెర పరిశ్రమకు కూడా కరోనా వ్యాపించింది. రెండు రోజుల క్రితం సీరియల్ నటుడు ప్రభాకర్ కరోనా బారిన పడినట్లు నిర్ధారణ అయ్యింది. తాజాగా మాటీవీలో ప్రసారం అయ్యే గృహాలక్ష్మి సీరియల్ నటుడు హరికృష్ణకు కరోనా సోకినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో పాటు, షూటింగ్స్ కి అనుమతులు ఇవ్వడం జరిగింది. అనేక గైడ్ లైన్స్ విడుదల చేస్తూ షూటింగ్స్ జరుపుకోవచ్చని చెప్పారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అనేకమంది పాల్గొనే షూటింగ్స్ అంత సేఫ్టీ కాదని బయట పడుతున్న కేసులను చూస్తుంటే అర్థం అవుతుంది. ఇలా వరుసగా పరిశ్రమలో కేసులు నమోదు అవుతుండగా…ఇప్పట్లో సినిమా షూటింగ్స్ మొదలుకాకపోవచ్చు.

Exit mobile version