సీనియర్ హీరో షూటింగ్ కి రెడీ !


‘పూలరంగడు, అహన పెళ్ళంట’ చిత్రాల డైరెక్టర్ వీరభద్రం చౌదరి దర్శకత్వంలో సీనియర్ హీరో డా. రాజశేఖర్ హీరో కొనసాగడానికి ఇంకా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం సరికొత్త తరహా కథాంశంతో ఓ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలో రాజశేఖర్ నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకి సంబంధించిన షూట్ పై దృష్టి పెట్టాడట ఈ సీనియర్ హీరో. కాగా ఈ సినిమా షూటింగ్ రేపటి నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలుకానుందని తెలుస్తోంది. కాగా ఎమోషనల్ గా సాగే ఆ సన్నివేశాల్లో రాజశేఖర్ తో పాటు మిగిలిన నటీనటులందరూ కూడా పాల్గొనబోతున్నారట.

ఇక రాజశేఖర్ గరడవేగ, కల్కి లాంటి సినిమాలు తర్వాత నటిస్తుండటంతో ఈ చిత్రం పై సహజంగానే కొంతవరకు అంచనాలు ఉన్నాయి. ఇక దర్శకుడు వీరభద్రం చౌదరి గత సినిమా ఫలితం దృష్టిలో పెట్టకుని.. ఈ సినిమాని చాలా జాగ్రత్తగా తీస్తున్నాడట. మరి రాజశేఖర్ కి ఈ చిత్రం ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.

Exit mobile version