సీనియర్ హీరోయిన్ రాధిక తన కొడుకు రాహుల్ పుట్టిన రోజు సంధర్భంగా సోషల్ మీడియాలో ఓ స్పెషల్ ఫోటో పంచుకున్నారు. అలాగే రాహుల్ సుఖ శాంతులతో హ్యాపీగా ఉండాలని కోరుకున్నారు. 16 ఏళ్ల ప్రాయంలో ఉన్న రాహుల్ కి హ్యాపీ బర్త్ డే టీనేజర్ అని రాధిక సంబోధించడం విశేషం. 2001లో నటుడు శరత్ కుమార్ హీరోయిన్ రాధికాను రెండో వివాహం చేసుకున్నారు. 2004లో రాహుల్ వారికి జన్మించాడు.
హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ మొదటి భార్య కూతురు. శరత్ కుమార్ మొదటి భార్య ఛాయా 2000లో విడాకులు తీసుకొని విడిపోయారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు వారిలో ఒకరే ఈ వరలక్ష్మీ. అనంతరం శరత్ కుమార్ కి బాగా సన్నిహితురాలైన నటి రాధికాను ఆయన పెళ్లి చేసుకున్నారు. వీరి ఒక్కగానొక్క సంతానమే రాహుల్.
Happy birthday my teenager,wish you loads of peace and happiness. Keep reaching for it I am always there for you my love ❤️❤️❤️❤️❤️❤️???????????????????????? pic.twitter.com/ySlGG5qwpM
— Radikaa Sarathkumar (@realradikaa) June 24, 2020