మన టాలీవుడ్ లో యూత్ ఎప్పటి యూత్ ని అయినా సరే యిట్టె అట్రాక్ట్ చెయ్యగలిగే అతి తక్కువమంది దర్శకుల్లో శేఖర్ కమ్ముల కూడా ఒకరు. ఆ లిస్ట్ తీస్తే బహుశా మొదట ఆయన పేరే వస్తుందేమో కానీ అప్పుడు “హ్యాపీ డేస్” నుంచి ఇప్పుడు “లవ్ స్టోరీ” వరకు తనదైన బెంచ్ మార్క్ సినిమాలను తీసి ఆకట్టున్నారు. మరి అలా ఆ మధ్య “ఫిదా”తో మంచి కం బ్యాక్ ఇచ్చిన ఈ దర్శకుడు తర్వాత టాలెంటెడ్ హీరో నాగ చైతన్య మరియు సాయి పల్లవిలతో స్టార్ట్ చేసిన చిత్రం “లవ్ స్టోరీ”.
మొదటి నుంచీ మంచి బజ్ ను అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు టీజర్ తో ముందుకు వచ్చింది. ఇక ఈ టీజర్ ను చూస్తే మాత్రం కమ్ములా మ్యాజిక్ మరోసారి డెఫినెట్ గ రిపీట్ అయ్యేలా ఉందనే అనిపిస్తుంది. రేవంత్ మరియు మౌనిక అనే ఇద్దరు మధ్య తరగతి మిడిల్ ఏజ్ యువతీ యువకులుగా తమకంటూ చిన్న ఆశయాలు వాటిలో స్ట్రగుల్స్ తో వీటన్నిటిని నడుమ వారి ప్రేమ ఎలా ఇమిడింది అన్న టైప్ లో ఈ టీజర్ ద్వారా చూపించారు.
ఇద్దరు మెయిన్ లీడ్ నటన అయితే సింప్లి నాచురల్ అని చెప్పాలి. ఈ చిత్రంతో మళ్ళీ శేఖర్ కమ్ముల తెలంగాణా ప్రాంగణాన్ని బాగా చూపించారు. ఇక అలాగే తన సినిమాల్లో మ్యూజిక్ చాలా కీ రోల్ పోషిస్తుంది మరి అలాగే ఈ టీజర్ లో పవన్ సి హెచ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ మ్యాజిక్ ను రిపీట్ చేసింది. దీనితో మళ్ళీ శేఖర్ కమ్ముల తన సినిమాల్లోని సోల్ తో మెస్మరైజ్ చెయ్యడం గ్యారంటీ అనిపిస్తుంది.
అలాగే కొన్ని విజువల్స్ లో విజయ్ సి కుమార్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మొత్తానికి మాత్రం వీరి మ్యాజిక్ ను థియేటర్స్ లోనే విట్నెస్ చేయనున్నామని చెప్తున్నారు. మరి ఈ చిత్రం ఎప్పుడు విడుదల వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్ మరియు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి వారు నిర్మాణం వహించారు.
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి