దీపిక ధరించిన గాగ్రా బరువు 30 కిలోలు

RamLeela
“ఓం శాంతి ఓం” చిత్రంతో మొదటి చిత్రంలోనే షారుఖ్ పక్కన కథానాయికగా చేసిన భామ దీపిక పదుకొనే. ఆ చిత్రంలో తన సొట్ట బుగ్గలతోనే కాకుండా సన్నగా నాజుగ్గా ఉండే తన ఫిజిక్ తో కూడా ప్రేక్షకులకు మత్తెక్కించింది. ఇప్పడు బాలీవుడ్ లో ప్రధాన హీరోయిన్ లలో ఒకరయిన దీపిక పదుకొనే ఇప్పటికీ అదే ఫిజిక్ తో ప్రేక్షకులను అలరిస్తుంది. త్వరలో ఈ భామ సంజయ్ లీల భన్సాలి దర్శకత్వంలో రానున్న “రామ్ లీల” అనే చిత్రంలో రణ్బీర్ కపూర్ సరసన కనిపించనుంది. ఈ చిత్రంలో ఈ భామ పాత్ర యువరాణి గా ఉండబోతుంది. ఈ పాత్ర కోసం ఆమె 30కేజీ ల బరువున్న గాగ్రాచోలిని ధరించి నటించినట్టు తెలుస్తుంది. అంజు మోడీ డిజైన్ చేసిన ఈ గాగ్రాలో దీపిక పదుకొనేను చూసిన వారందరు మంత్రముగ్దులు అయ్యారట. 50కేజీ ల బరువు ఉండే దీపిక ఇంత బరువున్న కాస్ట్యూమ్ ధరించి అంత వయ్యారంగా నడిచి వస్తుంటే ఎవరు మాత్రం ముగ్ధుడు అవ్వరు చెప్పండి అంటున్నారు ఆ చిత్ర బృందం. ఈ చిత్ర మొదటి లుక్ కి అద్భుతమయిన స్పందన లభించింది. ఈ 30కేజీ ల గాగ్రాలో దీపిక అందాన్ని చూడాలంటే మాత్రం చిత్రం విడుదల అయ్యే వరకు వేచి చూడవలసిందే.

Exit mobile version