షూటింగ్ పూర్తి చేసుకున్న సారొచ్చారు


మాస్ మహారాజ రవితేజ హీరోగా రానున్న ‘సారొచ్చారు’ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో రవితేజ సరసన కాజల్ అగర్వాల్ మరియు రిచా గంగోపాధ్యాయ జోడీ కట్టారు. కాజల్ మరియు రిచా రెండవసారి రవితేజ సరసన నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎక్కువ భాగం ఊటీ, యూరప్ మరియు హైదరాబాద్లో చిత్రీకరించారు. చాలా కాలం గ్యాప్ తర్వాత రవితేజ చేస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి ‘మంచి ప్రేమ కథతో’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాలో రవితేజ ఇద్దరు హీరోయిన్లతో చేసిన కెమిస్ట్రీ హైలైట్ కానుందని సమాచారం. పరశురాం డైరెక్ట్ చేసిన ఈ సినిమాని త్రీ ఏంజెల్స్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ప్రియాంక దత్ నిర్మించారు. విజయ్ కె. చక్రవర్తి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమా డిసెంబర్ 21న విడుదల కానుంది.

Exit mobile version