బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ తన కొత్త చిత్రానికి సంబంధించిన విశేషాలు పంచుకుంది. సోషల్ మీడియా వేదికగా ధనుష్ మరియు అక్షయ్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న ‘అట్రాంగి రే’ చిత్రం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ధనుష్, సారా జంటగా నటిస్తున్నారు. ఇక అక్షయ్ కుమార్ మరో హీరోగా ఈ చిత్రంలో నటిస్తున్నారు.
ధనుష్, అక్షయ్ ల కాంబినేషన్ వస్తున్న ‘అట్రాంగి రే’ చిత్రంలో నటించే అవకాశం దక్కడం నా అదృష్టం అన్నారు ఆమె. ‘అట్రాంగి రే’ ఓ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనుందని సమాచారం. మొదట్లో అక్షయ్ కుమార్ పాత్రను హ్రితిక్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇక అక్షయ్ కుమార్ ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో చేస్తున్న మొదటి చిత్రం ‘అట్రాంగి రే’. త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. బై లింగ్వల్ మూవీగా ఈ చిత్రం రానుంది.