11వ సంతోషం అవార్డ్స్ విన్నర్స్ లిస్టు

11వ సంతోషం అవార్డ్స్ విన్నర్స్ లిస్టు

Published on Sep 1, 2013 8:45 PM IST

Santhosham-Awards
‘సంతోషం’ అనే ఒక సినీ వారపత్రికని స్థాపించిన సురేష్ కొండేటి దానిని దినదినాభివృద్దిగా ఎంతో డెవలప్ చేసుకుంటూ లక్షల మంది చదివే స్థాయికి తీసుకెళ్ళాడు. అంతే కాకుండా స్థాపించిన మొదటి సంవత్సరం నుండి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం సంతోషం అవార్డ్స్ ని అందిస్తున్నాడు. ఈ సంవత్సరంతో సంతోషం పత్రిక 11 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా ఈ సారి ఒక్క తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియాలోని నాలుగు భాషల్లోని ఉత్తమ నటీనటులకు, టెక్నీషియన్స్ కి అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమం నిన్న సాయంత్రం సాయం సంధ్యా సమయంలో గచ్చిబౌలి స్టేడియంలో జరిగింది. 11వ సంతోషం అవార్డ్స్ వేడుకలో తెలుగు భాషలో ఉత్తమ నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు మీకోసం..

ఉత్తమ హీరో – మహేష్ బాబు (బిజినెస్ మేన్)

ఉత్తమ హీరోయిన్ – సమంత (ఈగ)

ఉత్తమ హాస్య నటుడు – బ్రహ్మానందం (జులాయి)

ఉత్తమ ఎడిటర్ – గౌతంరాజు (గబ్బర్ సింగ్)

ఉత్తమ కళా దర్శకుడు – అశోక్ (ఢమరుకం)

ఉత్తమ సంగీత దర్శకుడు – దేవీశ్రీ ప్రసాద్

ఉత్తమ డెబ్యూ సంగీత దర్శకుడు – జె.బి

ఉత్తమ ఫీమేల్ సింగర్ – సుచిత్ర

ఉత్తమ సాహిత్య రచయిత – భాస్కరభట్ల

ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ – మారుతి (ఈ రోజుల్లో)

ఉత్తమ చిన్న పిల్లల చిత్రం – శీనుగాడు (రామసత్యనారాయణ)

స్పెషల్ సింగర్ జ్యూరీ అవార్డు – వందేమాతరం శ్రీనివాస్

స్పెషల్ జ్యూరీ సాహిత్య రచయిత – కాసర్ల శ్యాం (బస్ స్టాప్)

రేడియో సిటీ లిజనర్స్ బెస్ట్ ఛాయస్ — సారొస్తారొస్తార (బిజినెస్ మేన్)

తాజా వార్తలు