“పంజా” చిత్ర నిర్మాతల్లో ఒకరయిన నీలిమ తిరుమల శెట్టి ఈ మధ్యనే సంగమిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద సంవత్సరానికి మూడు చిత్రాలను చేస్తున్నామని ప్రకటించింది. ఈ చిత్రాలను భారీ టాలెంట్ హంట్ నిర్వహించి వాటిలో ఎంపిక చేసిన స్సిప్ట్ లను చిత్రాలుగా మలచనున్నారు. ఇలా ఎంపిక చేసిన మొదటి చిత్రం “అలియాస్ జానకి” ఈ చిత్రం ఏప్రిల్ 25న హైదరాబాద్ లో మొదలు కానుంది సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఎల్ వి ప్రసాద్ అకాడెమీ నుండి పట్టా పొందిన ఇతను పలు లఘు చిత్రాలకు అవార్డులు గెలుచుకున్నారు. వెన్నెల 1 1/2
చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు.