కల్ట్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారిపోయాడు. ఆయన తన నెక్స్ట్ చిత్రం ‘స్పిరిట్’ ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న ఈ పోలీస్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పదుకొనె హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యింది. అయితే, కొన్ని కారణాల వల్ల ఇటీవల ఆమెను ఈ సినిమా నుంచి తప్పించారు. ఇక ఆమె స్థానంలో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీని ఈ సినిమాలో రీప్లేస్ చేశారు.
దీంతో దీపికా వర్సెస్ సందీప్ రెడ్డి గా ఈ వార్ మారింది. అయితే, సందీప్ రెడ్డిపై, స్పిరిట్ మూవీపై బాలీవుడ్ పీఆర్ విషం చిమ్ముతుండటంతో సందీప్ రెడ్డి ఈ విషయంపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యాడు. తాను ఓ యాక్టర్‌కి కథను చెప్పినప్పుడు అది బయటకు చెప్పరనే నమ్మకంతో ఉంటాడని.. కానీ, తన సినిమా విషయంలో ఇది ఆ హీరోయిన్ ఉల్లంఘించిందని ఆయన మండిపడ్డారు.
అయితే, ఇప్పుడు సందీప్ రెడ్డి ముందుకు మేజర్ టాస్క్ ఉందని చెప్పాలి. సో కాల్డ్ బాలీవుడ్ పీఆర్ నోరు మూయించాలంటే ‘స్పిరిట్’ మూవీతో భారీ విజయాన్ని అందుకుని తీరాలి. ఈ సినిమాతో ఆయన భారీ విజయాన్ని అందుకుంటేనే బాలీవుడ్ పీఆర్ సైలెంట్ అవుతుందని పలువురు కామెంట్ చేస్తున్నారు. మరి ఈ వార్‌లో సందీప్ రెడ్డి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.