ఖాన్ సిఫార్సుతో ఖాన్ దర్శకత్వంలో నటించనున్న ఖాన్

salman-and-sana-khan

సల్మాన్ ఖాన్ ఆతిధ్యం వహిస్తున్న ‘బిగ్ బాస్’ రియాలిటీ షోలో పాల్గొనడం సనా ఖాన్ కెరీర్ లోనే గుర్తుండిపోయే అంశం అవుతుంది. ఈమె మంచు మనోజ్ నటించిన ‘మిస్టర్ నూకయ్య’ సినిమాలో నటించింది. అదే కాక ‘గగనం’ మరియు ‘కళ్యాణ్ రామ్ కత్తి’ లలో నటించింది. బిగ్ బాస్ షోలో పాల్గున్నాక సల్మాన్ ఖాన్ కి ప్రియమైన పోటిదారునిగా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం తన కొత్త సినిమా ‘మెంటల్’ లో సల్మాన్ ఖాన్ ఈ భామకి ఒక రోల్ ఇస్తున్నాడట. సోహైల్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదలైంది. సనా ఖాన్ మరియు డైసీ షా ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని సమాచారం. ఈ సినిమా కాకుండా సనా ఖాన్ ‘క్లైమాక్స్’ అనే మలయాళం చిత్రంలో సిల్క్ స్మిత పాత్ర పోషించటానికి అంగీకరించింది.

Exit mobile version