సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ‘హృదయ కాలేయం’ అనే సినిమాతో ప్రేక్షకులను భీభత్సమైన రీతిలో ఆకర్షిస్తున్నాడు. ఇప్పడు ఈ సినిమా విడుదలకోసం అందరూ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తాజా ట్రైలర్ ను 4రోజుల్లో 5 లక్షలమంది యుట్యూబ్ ద్వారా వీక్షించారు. మొదటిసారిగా నటిస్తున్న ఏ హీరోకు అయినా ఇది ఒక అద్బుతమైన రికార్డు అనే చెప్పాలి.
‘రాష్ట్ర సంపూర్ణేష్ యువత’ పేరుతొ మన సంపూర్ణేష్ బాబుకు రోజురోజుకూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది.
తాజా సమాచారం ప్రకారం ‘హృదయ కాలేయం’ జూలైలో ప్రేక్షకులముందుకు రానుంది.