అంజాన్ షూటింగ్ లో సమంత

అంజాన్ షూటింగ్ లో సమంత

Published on Feb 7, 2014 6:25 PM IST

Samantha
సమంత ప్రస్తుతం అంజాన్ అనే తమిళ సినిమా షూటింగ్ లో బిజీగావుంది. లింగుస్వామి దర్శకత్వంలో సూర్యతో కలిసి మొదటిసారిగా నటిస్తుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పై సమంత చాలా ఆశలు పెట్టుకుంది. నిజానికి ఈ సినిమా సమంతకు భారీ కమ్ బ్యాక్ అని చెప్పచ్చు

మహారాష్ట్ర దగ్గర పంచ్ గని లో ఒక పాటను ఈ జంటపై ఇటీవలే చిత్రీకరించారు. ఈ సాంగ్ మాంచి హై బీట్ లో సాగిందట. దానిని ఇంత అందంగా తీర్చిదిద్దిన డ్యాన్సర్ లను పొగడకుండా వుండిపోయింది. . ఎటువంటి కాన్వాస్ లు లేకుండా, హంగులు లేకుండా అందంగా తెరకెక్కించారు. సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్. యువన్ శంకర్ రాజా సంగీతదర్శకుడు. ఆగష్టు 15న ఈ సినిమా విడుదలకానుంది

తాజా వార్తలు