‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రొడక్షన్ టీం స్పెయిన్ లో షూటింగ్ చేస్తోంది. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ – శృతి హాసన్ పై ఓ పాటని చిత్రీకరిస్తున్నారు. రేపటి నుంచి ఈ చిత్ర యూనిట్ తో సమంత కూడా జాయిన్ అవ్వనుంది. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకి దిల్ రాజు నిర్మాత.
ఈ చిత్ర ప్రొడక్షన్ టీం రేపు ఉదయం హైదరాబాద్లో ఈ సినిమా సెకండ్ టీజర్ ని రిలీజ్ చేయనుందని సమాచారం. ఎన్.టి.ఆర్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్న ఈ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకొని ఉన్నారు. అలాగే థమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా ఆడియోని సెప్టెంబర్ 8న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.