మళ్ళీ చాలా కాలం తర్వాత స్టార్ హీరోయిన్ సమంత తన తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చింది. నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా చేసిన ఆమె తాజా సినిమానే “శుభం”. యువ నటీనటులు హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపుడిలు నటించిన ఈ చిత్రం సమంతకి ఒక క్లీన్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
మరి ఈ సినిమా సక్సెస్ మీట్ లో ఓ ఇంట్రెస్టింగ్ అంశం సమంత రివీల్ చేసింది. ఈ చిత్రానికి శుభం అనే టైటిల్ కంటే ముందు దెయ్యం దిద్దిన కాపురం అనే టైటిల్ ని అనుకున్నట్టుగా తెలిపింది. సినిమాలో కూడా జరిగేది అదే కనుక ఈ టైటిల్ కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. కానీ ఒక అర్ధవంతమైన ఎండింగ్ ఈ సినిమాలో ఉంది కాబట్టి శుభం అనే టైటిల్ కూడా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది. ఇలా మరో ఇంట్రెస్టింగ్ టైటిల్ ఇపుడు ఈ సినిమాపై బయటకి వచ్చింది.